ఈ ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి


900 సంవత్సరాల క్రితం వరంగల్ లోని పాలంపేట ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు. ఆ సమయంలో వారు విస్మయపరిచే రామప్ప ఆలయాన్ని నిర్మించారు. మధ్యయుగం నాటి ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవమైన పరమశివుడు సహా ఇతర దేవతా విగ్రహాలను ఈ ఆలయాల్లో పూజిస్తారు. గణపతిదేవ పాలనలో సైన్యాధిపతి రేచర్ల రుద్ర పర్యవేక్షణలో ఈ ఆలయాలను నిర్మించినట్లు కధనం. ఈ ఆలయాలు ఒక మానవ నిర్మిత సరస్సుకు దగ్గర్లో ఉంటాయి. చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరును అందించేందుకు ఈ సరస్సును నిర్మించారు. ​ఈ అరుదైన ఆలయానికి శిల్పి పేరే పెట్టారట ఆశ్చర్యకరంగా ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దానిని రూపొందించిన శిల్పి రామప్ప స్తపతి పేరు పెట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయ సముదాయం లోపల రుద్రేశ్వర ఆలయం ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ కటేశ్వర ఆలయం, కామేశ్వర ఆలయం, మొదలగునవి చూడదగినవి. ఈ ఆలయ సముదాయంలో శాసనాలతో కూడిన స్తంభం, భక్తుల కోసం విశ్రాంతి గృహం కూడా ఉంది.

​ఈ నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి పచ్చదనంతో తీర్చిదిద్దబడిన మార్గం గుండా రామప్ప ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన ఇటుకలు ఎంతో తేలికగా, నీటిపై కూడా తేలియాడే విధంగా ఉంటాయి. ఈ ఇటుకల నిర్మాణానికి ఆనాడు ఉపయోగించిన సాంకేతికత నిజంగా ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది.

ఈ ఆలయ నిర్మాణంలో అద్భుతమైన ఇసుక పెట్టె సాంకేతికతను కూడా వినియోగించారు. పునాదుల్లోని ఖాళీల మధ్య ఇసుకను జోడించడం ద్వారా భూకంపాలు సంభవించినప్పుడు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ఇది దోహదపడుతుందని చెబుతారు. ​ఆశ్చర్యపరిచే శిల్పకళ ఈ ఆలయంలో గర్భ గృహ (గర్భగుడి), అంతరాళ (గర్భగృహం, మండపానికి కలిపి ఉండే సముదాయం), మహా మండప (ప్రజలు ఆచార క్రతువులు నిర్వహించే వేదిక) ఉన్నాయి. ఈ ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణ పనితనాన్ని మన కళ్లకు కడుతుంది.

ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది. గోడల నుంచి స్తంభాల వరకూ ఎక్కడ చూసినా హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియజేసే రమణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఎన్నో గాధలను తెలియజేస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిర్మాణాల్లో ప్రతి అణువు మీకు అద్భుతంగా అనిపిస్తుంది.

కాకతీయుల శిల్ప కళాభిమానానికి ఇవి తార్కాణాలు. ఆలయంలో 9 అడుగుల ఎత్తు గల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగం నుంచి వచ్చే సానుకూల, ఆధ్యాత్మిక తరంగాలు భక్తులకు మనో వికాసాన్ని కలిగిస్తాయి. ​నంది విగ్రహం ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది.

నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ముందుకు లంఖించేందుకు సన్నద్ధమై యజమాని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఇది కనిపిస్తుంది. నంది ముందు నించి ఏ దిశ వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ​ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న ఆలయం రామప్ప ఆలయం ఎన్నో యుద్ధాలను, దాడులను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపించడం విశేషం.

ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న కట్టడాలు శిధిలమైనా ప్రధాన ఆలయ సముదాయం మాత్రం ఎంతో ధృడంగా ఉంటుంది. ఇక్కడి శిల్ప కళను, చారిత్రక ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారతీయ పురాతత్వ పరిశోధ శాఖ ఈ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తుంది. ​సందర్శనకు సరైన సమయం శీతాకాలంలో రామప్ప ఆలయం సందర్శన ఎంతో ఆహ్లాద భరితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య వాతావరణం చల్లగా, పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఇక్కడ ఓ అమూల్యమైన సమయాన్ని మీరు గడపవచ్చు.

Comments

Popular Posts