శివపార్వతుల దశావతారాల గురించి మీకు తెలుసా!!



విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరికీ తెలుసు… కానీ పార్వతీపరమేశ్వరుల దశావతాతాల గురించి చలా మంది వినివుండరు . అవేమిటోతెలుసుకుందాం… అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం. ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు ఆయా రూపాలను ధరిస్తాడు. వాటిలో జంతు, పశు, పక్ష్యాది రూపాలు కూడా ఉంటాయి. ఇక శివపార్వతుల అవతారాల విశేషాలు చూద్దాం…

ప్రధమావతారము : మాహాకాళుడు, ఈయన అర్ధాంగి 'మాహాకాళి' వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు. ద్వితీయావతారము : తారకావతారము, 'తారకాదేవి' ఈయన అర్ధాంగి . సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు.
తృతీయావతారము : బాలభువనేశ్వరావతారము - సహచరి 'బాలభువనేశ్వరీ దేవి' సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.

చతుర్ధావతారము : షోడశ విశ్వేశ్వరుడు - 'షోడశ విద్యేశ్వరి' ఈయన భార్య. భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు.
పంచమ అవతారము : భైరవ అవతారము - భార్య 'భైరవి' ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు.
ఆరవ అవతారము : భిన్నమస్త — 'భిన్నమస్తకి' ఈయన పత్నీ.
ఏడవ అవతారము : ధూమవంతుడు — 'ధూమవతి' ఈయన శ్రీమతి.
ఎనిమిదవ అవతారము : బగళాముఖుడు — 'బగళాముఖి' ఈయన భార్య. ఈమెకు మరో పేరు బహానంద.
తొ్మ్మిదవ అవతారము : మాతంగుడు — 'మాతంగి' ఈయన భార్య.
దశావతారము : కమలుడు — 'కమల' ఇతని అర్ధాంగి.

Comments

Popular Posts