ఆ ఆలయంలో కంటికి క‌నిపించ‌ని శివ‌లింగం…

మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. మ‌రి కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా సమాధానాలు లేవు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అయితే శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూసారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన త్రిస్సూర్‌లో వడక్కునాథన్‌ ఆలయం ఉంది. కేరళలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శివుణ్ని వీరు ‘వడక్కునాథన్‌’గా ఆరాధిస్తారు.

ఈ ఆలయం కేరళీయుల నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది. ఆలయంలోని అత్యద్భుతమైన శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయం మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయాన్ని ఉదయం మూడింటికే తెరుస్తారు. ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు ఎందుకంటే తర తరాలుగా ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగానికి నేతితో అభిషేకం చేస్తున్నారు. నెయ్యితో శివలింగం అనేది కప్పబడి ఉంటుంది.



ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పటికి వరకు శివలింగం చూట్టు ఉన్న నెయ్యి అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా కర‌గ‌డం లేదు. ఎన్నో రోజుల నుండి ఉంటున్నా ఆ నెయ్యి అనేది దుర్వాస అనేది రాలేదు. మ‌రో విశేషం ఏంటంటే వాతావరణ మార్పులు అంటే శివలింగానికి వేడి తగిలిన, సూర్యరశ్మి తగిలిన, ఎండాకాలంలో సైతం కొన్ని వేల సంవత్సరాల నుండి శివలింగం చూట్టు ఉన్న నెయ్యి అనేది కరగడం లేదు. అయితే ఇప్ప‌టికీ కూడా ఇది మిస్ట‌రీగానే ఉండిపోయింది.



ఆలయ చరిత్ర ఏమిటంటే విష్ణువు పదో అవతారమైన పరుశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థానికుల నమ్మకం. ఈ ఆలయానికి 1600 సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతారు. ఇక్కడ పురాతన కాలం నుండి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తుండగా శివలింగం చూట్టు మూడు మీటర్ల మందంతో నెయ్యి అనేది ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు.

Comments

Popular Posts